ఒంగోలు అర్బన్: ఒంగోలులో పర్యటించిన మంత్రి కొల్లు రవీంద్ర, మెగా డీఎస్సీ పై మాట్లాడే అర్హత లేదని జగన్ పై విరుచుకుపడ్డ మంత్రి
Ongole Urban, Prakasam | May 31, 2026
మెగా డీఎస్సీపై మాట్లాడే హక్కు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేదని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఒంగోలు పర్యటన నిమిత్తం ఆదివారం వచ్చిన మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి నారా లోకేశ్ సారధ్యంలో మెగా డీఎస్సీని పకడ్బందీగా నిర్వహించారన్నారు. బురద చల్లాలనే ఉద్దేశంతోనే వైసీపీ పదేపదే డీఎస్సీ అంశాన్ని తెరపైకి తీసుకువస్తుందని మంత్రి విమర్శించారు.