బనగానపల్లె: కులగణన పై సుప్రీంకోర్టు తీర్పు హర్షనీయం : బీసీ సంక్షేమ సంఘం బనగానపల్లె నియోజకవర్గం అధ్యక్షులు వెంకటరమణ గౌడ్
జన గణనలో కుల గణన చేపట్టే అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు ఈ. వెంకటరమణ గౌడ్ అన్నారు. కుల గణనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టివేయడం సామాజిక న్యాయ సాధనకు కీలకమన్నారు. బీసీ కుటుంబాలు సర్వేలో పాల్గొని, తమ వివరాలను నమోదు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.