కామారెడ్డి: పోషణ మాస వార్షికోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి : మహిళాభివృది శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణా మాసం కార్యక్రమాన్ని కలెక్టర్ ఛాంబర్ లో నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్య్కక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొనడం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో 17 సెప్టెంబర్ నుండి అక్టోబర్ 16 వరకు నెల రోజుల కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇంటింటికీ న్యూట్రీషన్ పైన అవగాహన పెంచాలని చెప్పారు , గ్రామ స్థాయిలో అంగన్వాడీ టీచర్ లు మరియు ఆశ లు కలిసి పని చేయాలని చెప్పారు. మరియు గ్రామ సభ లో పోషకాహార మాసాన్ని నిర్వహించాలని సంబందిత అధియాకారులకు తెలియచేసారు.