ఒంగోలు అర్బన్: యువత భవిష్యత్తును చిన్నాభిన్నం చేస్తున్న గంజాయి మహమ్మారి కి దూరంగా ఉండాలి: టాస్క్ ఫోర్స్ సిఐ భీమా నాయక్
Ongole Urban, Prakasam | May 6, 2026
యువత భవిష్యత్తును చిన్నాభిన్నం చేస్తున్న గంజాయి మహమ్మారిపై ప్రకాశం జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా గంజాయి నిర్మూలనకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం పెళ్లూరు గ్రామ శివార్లలో గంజాయి వినియోగం మరియు అక్రమ రవాణా వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన సదస్సును నిర్వహించారు.టాస్క్ ఫోర్స్ సిఐ భీమా నాయక్ పర్యవేక్షణలో గ్రామస్తులతో సమావేశం ఎక్కడైనా గంజాయి సాగు, అమ్మకం లేదా నిల్వ ఉంచినట్లు సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు కోరారు.