పీఎం జన్ మన్ కింద మంజూరైన పథకాలను గడువులోగా పూర్తి చేయాలి: పాడేరులో ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ
పీఎం జన్ మన్ కింద మంజూరైన పథకాలను గడువులోగా పూర్తి చేయాలని ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరులోని ఐటీడీఏ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. పీఎం జన్ మన్ కింద మంజూరైన పథకాలను గడువు తేదీలోగా టార్గెట్లను పూర్తి చెయ్యాలని సూచించారు. ఫీల్డ్ విజిట్ కి వెళ్లి సమస్యలను పరిష్కరించి పోగ్రస్ చూపించాలని అధికారులను ఆదేశించారు.