కడప: సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్   నిర్వహణ అద్భుతంగా ఉంది: నీతి అయోగ్ జాయింట్ సెక్రెటరీ  సిద్ధార్థ్ జైన్
Kadapa, YSR | Oct 29, 2025 సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్  నిర్వహణ అద్భుతంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం మరింత బాగుందని దేశానికే ఆదర్శవంతంగా ఉన్నాయని.. నీతీ ఆయోగ్ జాయింట్ సెక్రెటరీ మరియు వైఎస్ఆర్ కడప ఆకాంక్షిత జిల్లా ప్రాబరీ అధికారి సిద్దార్థ్ జైన్ సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా పర్యటన లో భాగంగా బుధవారం జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తోకలిసి రాష్ట్రానికే ఆదర్శవంతంగా నిర్మించి, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ను సమర్థవంతంగా నిర్వహిస్తున్న సి.కె.దిన్నె జెడ్పీ హైస్కూలులోని సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్  ను నీతి ఆయోగ్ జాయింట్ సెక్రెటరీ పరిశీలించారు.