విశాఖపట్నం: మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ అంబేద్కర్ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం
రాష్ట్రంలోని 10 మెడికల్ కాలేజీ లను పి పి పద్ధతిలో ప్రైవేట్ కు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ఏ ఎం ఎస్ దళిత సంఘాలు రాజకీయ పార్టీలు విద్యార్థి యువజన సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవనంలో ఆదివారం సాయంత్రం రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన మేధావులు ఉద్యోగులు రాజకీయ పార్టీల ప్రముఖులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటుకు అప్పగించడం వల్ల మెడికల్ విద్య పేద విద్యార్థులకు దూరం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.