హత్నూర: ఎనిమిదవ జాతీయ పోషన్ అభియాన్ మాసం కార్యక్రమం విజయవంతం చేయాలి : సంగారెడ్డి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్
సెప్టెంబర్ 17 నుండి వచ్చేనెల 16 వరకు జరగనున్న ఎనిమిదవ జాతీయ పోషణ అభియాన్వాసం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంగారెడ్డి జిల్లా అదనం కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని చాంబర్లో మహిళా శిశు సంక్షేమ శాఖ వైద్య ఆరోగ్యశాఖ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులతో పోషన్ అభియాన్ కార్యక్రమం పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రభుత్వం పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గర్భిణీలు బాలింతలు కిశోర బాలికల, పిల్లలకు పోషకాహారం పై అవగాహన కల్పించాలన్నారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.