ఒంగోలు అర్బన్: బీసీ రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించేందుకు ఒంగోలు వచ్చిన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్
Ongole Urban, Prakasam | May 26, 2026
రాజ్యాంగ నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించేందుకు అవసరమైన అంచనా వేయడం కోసం డెడికేటెడ్ కమిషన్ కృషి చేస్తోందని కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంత స్థానిక సంస్థలలో బిసి రిజర్వేషన్ల పై అధ్యయనం మరియు వినతుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా మంగళవారం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాల్లో డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా, జిల్లా కలెక్టర్ రాజాబాబు తో కలసి ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ అధికారులతో సమావేశం నిర్వహించారు.