ఉరవకొండ: ఉద్యాన పంటల్లో తీసుకోవాల్సిన సస్యరక్షణ, చీడపీడల నివారణ చర్యలపై రైతులకు ఉద్యాన శాస్త్రవేత్తలతో శిక్షణ కార్యక్రమం
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం రామసాగరం గ్రామంలో రైతు సేవ కేంద్రం నందు ఉద్యాన పంటల్లో సీజనల్ వారిగా తీసుకోవలసిన జాగ్రత్తలు సస్యరక్షణ చర్యలు మరియు చీడపీడల నివారణ పై కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త యుగంధర్ బెలుగుప్ప మండల ఉద్యాన శాఖ అధికారి కృష్ణ తేజ ఆధ్వర్యంలో బుధవారం రైతులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం నుండి 2025 -26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త ఉద్యాన పంట తోటలకు సబ్సిడీ పథకాలను వివరించారు. ఎస్సీ ఎస్టీ రైతులకు పథకాల అమలులో మొదటి ప్రాధాన్యత ఉంటుందన్నారు. అనంతరం క్షేత్రస్థాయిలో ఉద్యాన పంటను పరిశీలించి రైతుల సందేహాలను నివృత్తి.