ఒంగోలు అర్బన్: పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమంకు 49 ఫిర్యాదులు
Ongole Urban, Prakasam | May 4, 2026
ప్రకాశం జిల్లా ప్రజల నుంచి వచ్చే పలు రకాల ఫిర్యాదులను పరిష్కారించి బాధితులకు న్యాయం అందించాలనే లక్ష్యంతో సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మరియు పోలీస్ అధికారులు ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం (మీకోసం)ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలకు సంబంధించిన వ్రాతపూర్వక అర్జీలను స్వేచ్ఛాయుత వాతావరణంలో జిల్లా ఎస్పీ కి మరియు పోలీస్ అధికారులకు తెలియచేసినారు. జిల్లా ఎస్పీ ఫిర్యాదుదారులతో మాట్లాడి, వారి సమస్యల వివరాలను తెలుసుకొని,వాటిని చట్టప్రకారం త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా కల్పించారు.