నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాలోని గాలేరు నదిపై భారీ వంతెన నిర్మాణం ప్రారంభం
Nandyal Urban, Nandyal | Jul 5, 2026
నంద్యాల జిల్లా వెలుగోడు మండలం బోయరేవులలో గాలేరు నదిపై భారీ వంతెన నిర్మిస్తున్నారు. కల్వకుర్తి-జమ్మలమడుగు నేషనల్ హైవే 167Kలో భాగంగా బోయరేవులలో వంతెన నిర్మాణం పనులు ప్రారంభించినట్లు కంపెనీ ప్రతినిధిలు తెలిపారు. ఇక్కడి నుంచి నేరుగా నంద్యాల-అయ్యలూరు మెట్ట వద్ద రోడ్డు కలుస్తుందని పేర్కొన్నారు. హైవే పనులకు గ్రామస్థుల సహకారం మరువలేనిదన్నారు. త్వరితగతిన హైవే పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు.