సంగారెడ్డి: పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో లక్ష్య పుష్పార్చన కార్యక్రమం
సంగారెడ్డి పట్టణం శ్రీనగర్ కాలనీ లోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ 4వ వార్షికోత్సవ వేడుకలు శనివారం నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాలతో స్వామివారి మూర్తులకు ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను జరిపించారు. అనంతరం మహిళలు లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని జరిపించారు. భక్తులు పూజించిన పూలను లక్ష్మీనరసింహస్వామి మూర్తులకు ప్రత్యేకంగా అలంకరించారు.