గుంటూరు: చంద్రబాబు మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గం: నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు శ్రీనివాసరావు
Guntur, Guntur | Sep 16, 2025 ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దళిత వ్యతిరేకి అని మరోసారి రుజువు అయిందన్నారు నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పరిసపోగు శ్రీనివాసరావు మాదిగ. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ను వ్యతిరేకిస్తూ మంగళవారం మధ్యాహ్నం నగరంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సర్కిల్ సెంటర్ వద్ద నిరసన చేపట్టారు. అనంతరం మీడియాతో పరిసపోగు శ్రీనివాసరావు మాదిగ మాట్లాడుతూ చంద్రబాబు పేదల వ్యతిరేకి అన్నారు. గత వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ కి వచ్చిన 17 మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గం అన్నారు. తక్షణమే ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.