I BOMMA నిర్వాహకుడు ఇమ్మడి రవికి 14 రోజుల రిమాండ్ పడింది. అతడిని చంచల్గూడ జైలుకు తరలించారు. మెజిస్ట్రేట్ ఇంట్లో హాజరుపర్చగా రిమాండ్ విధించారు. ఇదే సమయంలో రవిని 7 రోజుల పాటు కస్టడీకి పోలీసులు కోరినట్లు తెలుస్తోంది. I BOMMA, BAPPAM వెబ్సైట్లను పోలీసులు బ్లాక్ చేశారు. కాగా, గతంలో వచ్చిన ఫిర్యాదులతో రవి మీద నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.