వరంగల్ నగరంలో 18 మందిపై దాడి చేసి గాయపరిచిన కుక్కలు
వరంగల్ నగరంలోని 36వ డివిజన్ చింతల్ లో వీధి కుక్కలు చిన్న పెద్ద అనే తేడా లేకుండా పలు కాలనీలలో సుమారు 18 నుండి 20 మందిపై దాడి చేశాయి. వీధి కుక్కలపై గతంలో అనేకసార్లు స్థానిక కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ రిజ్వాన షమీం మసూద్ తో విన్నవించుకున్న సమస్య పరిష్కారం కాలేదని వారు వాపోతున్నారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా వీధి కుక్కలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలకు మరియు పిల్లలను బయటికి పంపాలంటేనే భయం భయంగా ఉందని ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు వీధి కుక్కలను తమ కాలిన నుండి తీసుకువెళ్లాలని వారు కోరుకుంటున్నారు.