అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం వేల్పుమడుగు రెవిన్యూ గ్రామ పరిధిలోని జనార్ధన పల్లి గ్రామానికి చెందిన పాండురంగ స్వామి దేవాలయానికి సంబంధించిన భూములను పరిరక్షించుకుందామని స్థానిక టిడిపి నాయకులు శనివారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. వైఎస్సార్ సీపీకి చెందిన కొందరు పాండురంగ స్వామి ఆలయ భూములను కాజేయాలని చూస్తున్నారన్నారు. ఘటనకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ను బాధ్యులు చేస్తూ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడటం తగదని నిజా నిజాలు పరిశీలించి మాట్లాడాలని స్థానిక టిడిపి నాయకులు పేర్కొన్నారు.