రాయచోటి పట్టణంలో అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. గాలివీడు రోడ్డులో బైకుపై వెళ్తున్న వ్యక్తిని కొత్త పోలీస్ స్టేషన్ సమీపంలో అటు ఇటుగా తిరుగుతున్న కుక్కలు వెంటాడాయి. ఈ క్రమంలో బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుడిని ఢీకొట్టింది. బలమైన దెబ్బకు వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.మృతుడు పజిల్ (42)గా గుర్తించారు. ఘటన చోటుచేసుకున్న ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది.