బనగానపల్లె: డీఎస్సీ అక్రమాలపై నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి :బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని
నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో డీఎస్సీ అక్రమాలపై మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈనెల 6,7, 8,9తేదీలలో నియోజకవర్గంలో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ధర్నాలు అలాగే 10వ తేదీ కోవెలకుంట్ల పట్టణంలో చేపట్టనున్న భారీ ర్యాలీ గురించి చర్చించారు. డీఎస్సీ అక్రమాలకు నిరసనగా విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని ఈ సందర్భంగా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైసిపి నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు