నంద్యాల అర్బన్: వర్షపు నీరు నిలిచి కుంటలను తలపిస్తున్న నంద్యాల ఆటోనగర్
Nandyal Urban, Nandyal | Jun 18, 2026
నంద్యాల పట్టణంలోని ఆటోనగర్లో వర్షం నీరు నిలిచి దుకాణాల ముందు చిన్నపాటి కుంటలను తలపిస్తున్నాయి. కర్నూలు ప్రధాన రహదారి పక్కన వర్షం నీరు నిలవడం వలన రాత్రివేళ ఈగలకు, దోమలకు ఆవాసంగా మారి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయని కాలనీవాసులు గురువారం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం నీరు నిలవకుండా మున్సిపల్ అధికారులకు చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు