నంద్యాల అర్బన్: మహానంది క్షేత్రంలో భక్తులు పోగొట్టుకున్న బంగారు తాళిబొట్టు తిరిగి అందజేత
Nandyal Urban, Nandyal | Apr 30, 2026
నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో భక్తులు పోగొట్టుకున్న బంగారు తాళిబొట్లను దేవస్థానం అధికారులు అందజేశారు. గురువారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్కు చెందిన నాగేశ్ పతి కుటుంబ సభ్యులు రుద్రగుండం కోనేరులో స్నానం ఆచరిస్తూ ఉండగా బంగారు తాళిబొట్లను జారవిడుచుకున్నారు. ఆలయ అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. వారు స్థానిక యువకులతో వెతికించి బాధితులకు అందజేశారు.