అనంతపురం జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం శనివారం నాలుగు గంటల 40 నిమిషాల సమయంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పాపంపేటలో ఎమ్మెల్యే పరిటాల సునీతకు తెలియకుండానే 932 ఎకరాలు భూమి ఆక్రమణ చేసేందుకు ఎవరైనా ప్రయత్నం చేస్తారా ఎమ్మెల్యే పరిటాల సునీత పరిటాల శ్రీరామ్ తెలిసే ఇదంతా జరుగుతుందని ఈరోజు పరిటాల శ్రీరామ్ మీడియా సమావేశం ఏర్పాటుచేసి భూ అక్రమాల గురించి తనకు తెలియదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి పరిటాల శ్రీరామ్ పై పలు విమర్శలు చేశారు.