అనంతపురం అర్బన్: రత్నాలపల్లి రైల్వే స్టేషన్ లో ప్రమాదవశాత్తు రైలులో నుంచి పడడంతో కర్ణాటక కు చెందిన ప్రయాణికుడికి గాయాలు
Anantapur Urban, Anantapur | Apr 10, 2026
శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని కదిరి నియోజకవర్గం కదిరి మండలం రత్నాలపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తు రైలులో నుంచి పడడంతో కర్ణాటక రాష్ట్రానికి చెందిన మణికంఠ అనే ప్రయాణికుడికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.