తాడిపత్రి: పట్టణంలో వాకింగ్ కు వెళ్తున్న మాజీ మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ ఓబిరెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో మాజీ మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ ఓబిరెడ్డిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన మాజీ మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ ఓబిరెడ్డి మంగళవారం యల్లనూరు రోడ్డులో వాకింగ్ కు వెళ్ళి నడుచు కుంటూ వెళ్తుండగా అప్పటికే అక్కడ కాపు కాచిన సుమారు ఎనిమిది మంది గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణ రహితంగా దాడి చేశారు. కర్రలు, రాళ్ళు, రాడ్లతో దాడి చేస్తూ సంఘటన స్థలం పక్కనే ఉన్న గుంతలో కంప చెట్లలోకి తోసేశారు. అనంతరం దాడి చేసిన వారు బైక్ లలో పారిపోయారు.