ఒంగోలు అర్బన్: ఒంగోలులో సంతమాగులూరు మండలానికి చెందిన దుర్గాప్రసాద్ కుటుంబం మీడియా సమావేశం, ప్రాణహాని ఉందని వెల్లడి
Ongole Urban, Prakasam | Jul 6, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో సోమవారం సంతమాగులూరు మండలానికి చెందిన దుర్గాప్రసాద్ కుటుంబం మీడియా సమావేశం నిర్వహించింది. తమ బంధువులు తమ పొలంలోకి ఇంటిలోకి రానివ్వడం లేదంటూ వారు ఆరోపించారు. వారితో తమకు ప్రాణహాని ఉందని పోలీసులను సంప్రదించిన తమకు న్యాయం జరగలేదని దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులు వాపోయారు. పొలంలోకి వేస్తే తాము చంపుతామని తమ బంధువులు బెదిరిస్తున్నారని తమకు రక్షణ కల్పించి తమ ఆస్తులను తమకు వచ్చేలా చూడాలని ప్రసాద్ కుటుంబం అధికారులను కోరుతున్నారు.