పిచాటురు : అప్పంబట్టు వద్ద రోడ్డు ప్రమాదం.
వ్యక్తి మృతి
పిచ్చాటూరు మండలంలోని అప్పంబట్టు వద్ద తిరుపతి- చెన్నై జాతీయ రహదారిపై శనివారం ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అప్పంబట్టుకు చెందిన ఓ వృద్ధుడు రోడ్డు పక్కన నడిచి వెళుతుండగా బైక్ ఢీకొంది. ఈ ఘటనలో ఆ వృద్ధుడు ఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.