ఒంగోలు అర్బన్: జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో టాయిలెట్లు, త్రాగునీరు, ఇతర మౌలిక వసతుల కల్పనపై తక్షణమే దృష్టి సారించాలి :కలెక్టర్ రాజాబ
Ongole Urban, Prakasam | Jun 6, 2026
జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో టాయిలెట్లు, త్రాగునీరు, ఇతర మౌలిక వసతుల కల్పనపై తక్షణమే దృష్టి సారించాలని కలెక్టర్ రాజాబాబు స్పష్టం చేశారు. శనివారం ఆయన అధ్యక్షతన ప్రకాశం భవనంలో జిల్లాస్థాయి తాగునీరు, పారిశుధ్య కమిటీ సమావేశం జరిగింది. జలజీవన్ మిషన్ పథకం కింద జిల్లాలో చేపట్టిన పనుల పురోగతిపై ఆరా తీశారు. ఈ క్రమంలో పాఠశాలలు, కళాశాలలో త్రాగునీరు, టాయిలెట్లు, ఇతర పారిశుద్ధ్య సదుపాయాలపై ప్రత్యేకంగా చర్చించారు. మరమ్మతులు, ఇతర నిర్వహణ పనులు చేపట్టాల్సిన అవసరం ఉంటే పాఠశాలలు పునః ప్రారంభమయ్యేలోపు వీటిని పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు