చిన్నగూడూరు: ఉగ్గంపల్లి గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో, 100 టేకు చెట్లు దగ్ధం
మహబూబాబాద్ జిల్లా, చిన్నగూడూరు మండలం, ఉగ్గంపల్లి గ్రామంలో కాంచనపల్లి ముత్తమ్మ అనే మహిళ రైతు ఆకేరు వాగు సమీపంలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో ,సుమారు ఐదు గంటల భూమిలో గత 15 సంవత్సరాల క్రితం నాటిన టేక్ చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో, సుమారు 100 టేకు చెట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. దీంతో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని, ఈ ఘటనకు పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని బాధితుల డిమాండ్ చేస్తున్నారు.