మిర్యాలగూడ: పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి: బీసీ యువజన సంఘం నేత అశోక్
నల్గొండ జిల్లా, మిర్యాలగూడ పట్టణ కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్లకు వేల కోట్లు ఇస్తున్న ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. దీనివల్ల విద్యార్థులు చదువుకు దూరమయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.