నంద్యాల అర్బన్: నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి సుమారు 50 లక్షల రూపాయల విలువైన వైద్య పరికరాలు పంపిణీ చేసిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
Nandyal Urban, Nandyal | Jul 1, 2026
జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (GGH)కి CSR సహకారంతో సుమారు రూ.50 లక్షల విలువైన అత్యాధునిక వైద్య పరికరాలను ఎంపీ బైరెడ్డి శబరి అందజేశారు. అత్యవసర వైద్య సేవలు, ఐసీయూ చికిత్సలను మరింత బలోపేతం చేసేలా వెంటిలేటర్లు, ఇన్ఫ్యూషన్ పంపులు, ఐసీయూ పరికరాలు, హాస్పిటల్ బెడ్లు, లారింజోస్కోప్లు తదితర అత్యవసర వైద్య సామగ్రిని ఆసుపత్రికి అందించారు.