ఆత్మకూరు: ఆత్మకూరు మండల కేంద్రంలో వాహనాల తనిఖీలో 1,11,000 స్వాధీనం.
వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండల కేంద్రంలో ఆత్మకూర్ పరమేశ్వర స్వామి చెరువు సమీపంలోని వై జంక్షన్ దగ్గర శనివారం సాయంత్రం ఐదు గంటలకు అక్రమంగా తరలిస్తున్న లక్ష 11 వేల రూపాయలను ఇరువురి వ్యక్తుల నుండి స్వాధీన పరచుకున్నట్లుగా ఆత్మకూరు సీఐ శివకుమార్ ఎస్సై నరేందర్ తెలిపారు వాహన తనిఖీల్లో భాగంగా ధరూర్ మండలానికి చెందిన రాములు రంగన్న ఇరువురు వ్యక్తులు లక్ష 11 వేల రూపాయలను తరలిస్తుండగా ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో స్వాధీన పరచుకుని ఉన్నతాధికారులకు అందజేశారు వాహన తనిఖీలలో సిఐఎస్ఐ తో పాటుగా పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.