గ్రామపంచాయతీ కార్మికులు కలెక్టర్ కార్యాలయం ముందు జీతాలు ఇవ్వాలని బతుకమ్మ ఆడుతూ నిరసన
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సద్దుల బతుకమ్మ పండుగను నిర్వహించాలని లక్షల రూపాయలు ఖర్చుపెడుతున్న గ్రామపంచాయతీ కార్మికులకు మాత్రం మూడు నెలల జీతాలు ఇవ్వడానికి ప్రభుత్వానికి చేతులు రావడంలేదని దీని ఫలితంగా కార్మికులు పస్తులు ఉండాల్సిందే నా అని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా గౌరవ అధ్యక్షులు చక్రపాణి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి బతుకమ్మ ఆటపాటలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చక్రపాణి మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు అతి ముఖ్యమైన సద్దుల బతుకమ్మ