అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం చిన్నముస్టూరు గ్రామంలో గురువారం పోలీసులు విస్తృత స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఉరవకొండ స్టేషన్ పోలీస్ సిబ్బంది గ్రామాన్ని పూర్తిగా చుట్టుముట్టి, అనుమానాస్పదంగా గుర్తించిన ఇళ్లలో సోదాలు చేపట్టారు. గ్రామంలో శాంతిభద్రతలకు భంగం చెందకుండా ఉండటం, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం, నేరాలను ముందస్తుగా నివారించడమే ఈ తనిఖీల ప్రధాన లక్ష్యమని పోలీసులు తెలిపారు.