బనగానపల్లె: బనగానపల్లెలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు
బనగానపల్లెలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 316వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈడిగ వెంకటరమణ గౌడ్, దేవుడు గౌడ్, హరికృష్ణ గౌడ్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బహుజనుల ఆత్మగౌరవం కోసం పోరాడిన మహాయోధుడు పాపన్న గౌడ్ అని కొనియాడారు. ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని, భావితరాలకు స్ఫూర్తిదాయకమని నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీసీ నాయకులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.