ఉరవకొండ: మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ కేంద్రంలోని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ తన క్యాంఫు కార్యాలయంలో వాల్మీకి నాయకులతో కలిసి వాల్మీకి మహర్షి జయంతోత్సవం సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రామాయణ రచనలు చేసి కుటుంబ వ్యవస్థతో నీతి ధర్మం న్యాయం బోధించిన మహానుభావుడు వాల్మీకి మహర్షిని ఈ సందర్భంగా వారు కొనియాడారు.