చెన్నూరు: మందమర్రి ప్రాణహిత కాలనీలో పిడుగుపాటుకు పేలిపోయిన టీవీలు, ఫ్రిజ్ లు
మందమర్రి పట్టణంలో నిన్న రాత్రి పడిన పిడుగులకు ప్రాణహిత కాలనీలో టీవీలు, ఫ్రిజ్లు పేలిపోయి భారీ నష్టం జరిగింది. ఈ మేరకు ఆదివారం ఉదయం ప్రాణహిత కాలనీ బాధితులు మాట్లాడుతూ కాలనీలో కరెంటు వైర్ల కింద ఉన్నటువంటి చెట్లు, కొమ్మలు మున్సిపల్ మరియు విద్యుత్ శాఖ సిబ్బంది తొలగించక లేకపోవడంతో పిడుగుపాటుకు విద్యుత్ షాక్కు గురై ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కాలిపోవడం జరిగిందని వాపోయారు. ఎలక్ట్రికల్ మరియు మున్సిపల్ సిబ్బంది విద్యుత్తు లైనులకు అడ్డులేకుండా తగు జాగ్రత్త తీసుకోవాలని కోరారు.