డోన్: హాస్టల్ నుంచి పారిపోతున్న పిల్లలను పట్టుకున్న బేతంచెర్ల పోలీసులు
Dhone, Nandyal | Jun 27, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం గోరుమానుకొండ వద్ద ఉన్న ఎంజేపీ హాస్టళ్లో ఉన్న విద్యార్థుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సీఐ వెంకటేశ్వరావు సూచించారు. శనివారం కొలిమిగుండ్ల మండలం కల్వటాలకు చెందిన వంకదారి వరుణ్, సంజామలలోని ఆకుమల్లకు చెందిన సందీప్ కుమార్ ఐదో తరగతిలో చేరారు. తల్లిదండ్రులపై బెంగతో హాస్టల్ నుంచు పారిపోతుండగా కౌన్సెలింగ్ ఇచ్చి ప్రిన్సిపల్, తల్లిదండ్రులతో కలిసి పంపించినట్లు సిఐ తెలిపారు