బనగానపల్లె: సచివాలయ అధికారుల నిర్లక్ష్యం :బేతంచర్ల లో రైతుల ఆగ్రహం
నంద్యాల జిల్లా బేతంచర్ల మండలం ముద్దవరం గ్రామ సచివాలయంలో రైతులు, గ్రామస్థులు గంటల తరబడి అధికారుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. శుక్రవారం ఉదయం నుంచి వివిధ ధృవపత్రాలు, పంట నమోదు, రెవెన్యూ పనుల కోసం వచ్చిన ప్రజలు.. సమయం 11 అవుతున్నా సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యంతో ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు స్పందించి సమయపాలనపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నా