కొత్తగూడెం: వైద్య రంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో వైద్య రంగంలోఉన్న సమస్యలని వెంటనే పరిష్కారం చేయాలనీ కోరుతూ ప్రగతిశీల యువజన సంఘం (PYL )భద్రాద్రి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట బుధవారం ఆందోళన నిర్వహించారు.ప్రగతిశీల యువజన సంఘం (PYL)కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు నరసింహారావు మాట్లాడుతూ కొత్తగూడెం జిల్లా లో ఖాళీగా ఉన్న డాక్టర్, నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, పార్మాసిస్ట్ ఉద్యోగాలని వెంటనే భర్తీ చేయాలనీ డిమాండ్ చేశారు..సీజనల్ వ్యాధులను నివారించాలని,ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీ ని నివారించాలని,గ్రామీణ ప్రాంతాలలో వైద్య శిబిరాలు నిర్వహించాలని కోరారు.