నంద్యాల అర్బన్: బిగ్ బాస్ 10 లో తనకు అవకాశం కల్పించాలంటూ నంద్యాల జిల్లా ఎస్సై విజ్ఞప్తి,సోషల్ మీడియాలో వీడియో వైరల్
Nandyal Urban, Nandyal | Jun 25, 2026
నంద్యాల జిల్లా గడివేముల ఎస్సై నాగార్జున రెడ్డి బిగ్బాస్-10లో అవకాశం కల్పించాలని కోరుతూ విడుదల చేసిన సెల్ఫీ వీడియో బుధవారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సామాన్య ప్రజలకు కూడా అవకాశం కల్పిస్తున్న ఈ రియాలిటీ షోలో తనకు కూడా ఛాన్స్ ఇవ్వాలని ఆయన నిర్వాహకులను విజ్ఞప్తి చేశారు. పోలీసు విధులతో పాటు తనలోని ప్రత్యేక ప్రతిభను ప్రదర్శించేందుకు బిగ్ బాస్ వేదిక సరైన అవకాశం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది.