బనగానపల్లె: బనగానపల్లె పంచాయతీ కార్యాలయం తాత్కాలికంగా మార్పు
నంద్యాల జిల్లా బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి పనుల్లో భాగంగా పాత పంచాయతీ కార్యాలయాన్ని తొలగించారు. నూతన భవన నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో, కార్యాలయాన్ని స్థానిక మండల ప్రజా పరిషత్ ప్రాంగణంలోకి మార్చినట్లు అధికారులు వెల్లడించారు. పంచాయతీకి సంబంధించిన విధులన్నీ ప్రస్తుతం అక్కడి నుంచే జరుగుతాయని, ప్రజలు ఈ మార్పును గమనించాలని సంబంధిత అధికారులు తెలిపారు