కొత్తపేటలో ఎన్డీఏ కూటమి గెలుపు, వైకాపా ఓటమి తథ్యం:కొత్తపేటలో కొత్తపేట అసెంబ్లీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావు
కొత్తపేట నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి గెలుపు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తథ్యమేనని కొత్తపేట అసెంబ్లీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావు అన్నారు. ఈ మేరకు ఆయన కొత్తపేటలో బుధవారం మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ అభ్యర్థిగా తాను గెలవబోతున్నట్లు వైకాపాకు చెందిన నాయకులే ఫోన్ చేసి మరి తన గెలుపును అంచనాలు వేసి చెబుతున్నారని అన్నారు. ఎన్డీఏ కూటమి తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అన్న విషయాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారని ఆయన తెలిపారు.