అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో శనివారం సాయంత్రం 4.30 గంటలకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైయస్సార్సీపి పిఎసి సభ్యులు మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకునే విషయంలో పూర్తిగా విఫలమైందన్నారు. అందుకు ఉదాహరణ సింగనమల నియోజకవర్గం ఎల్లుట్ల గ్రామంలో జరిగిన అరటి రైతు ఆత్మహత్య ఇది చాలా దురదృష్టకరం అని పేర్కొన్నారు.