పటాన్చెరు: కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని బీరంగూడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు
కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని బీరంగూడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయంలో భక్తిపరమైన వాతావరణం నెలకొంది. ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజామున నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు వ్రతాల్లో పాల్గొని స్వామివారిని ఆరాధించారు.వ్రతం అనంతరం భక్తులు స్వామివారికి ప్రత్యేక హారతులు సమర్పించి, తీర్థ ప్రసాదం స్వీకరించారు. కార్తీక పౌర్ణమి రోజున సత్యనారాయణ వ్రతం చేయడం ద్వారా కుటుంబంలో శాంతి, ఐశ్వర్యం కలుగుతుందని అర్చకులు తెలిపారు. కార్తీక పౌర్ణమి రోజు స్వామి వ్రతం చేయడం మనకు ఎంతో పుణ్యఫలితాలను అందిస్తుందన్నారు.