నంద్యాల పట్టణంలో ఆదివారం న్యాయవాదులకు క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హుస్సేన్ బాషా, స్పోర్ట్స్ సెక్రటరీ లింగమయ్య తెలిపారు. సెమీ క్రిస్మస్ సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు న్యాయవాదులకు, కోర్టు సిబ్బందికి మధ్య ఈ పోటీలు జరుగుతాయన్నారు. నంద్యాల మూడవ అదనపు జిల్లా జడ్జి అమ్మనరాజా ఈ క్రికెట్ పోటీలను ప్రారంభిస్తారని వారు తెలిపారు.