ఒంగోలు అర్బన్: ప్రకాశం యువ సాతి మిషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Jun 30, 2026
ప్రకాశం జిల్లా యువతకు బంగారు భవిష్యత్ను అందించడంతో పాటు సమాజంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే సంకల్పంతో ప్రారంభించుకున్న” ప్రకాశం యువ సాతి మిషన్ ‘ కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా అమలు చేయడంలో తమవంతు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు, విద్యా శాఖాధికారులకు సూచించారు. చదువుతో పాటు సమాజానికి ఉత్తమ పౌరులను అందించాలన్న లక్ష్యంతో రూపొందించిన ” ప్రకాశం యువ సాతి మిషన్ ‘ కార్యక్రమాన్ని మంగళవారం ఒంగోలు కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాల్లో జిల్లా కలెక్టర్ రాజాబాబు లాంఛనంగా ప్రారంభించారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రకాశం జిల్లా యువతకు బంగారు భవిష్యత్ను అందించాలన్నారు