బనగానపల్లె: నొసం గ్రామంలో ఈనెల 27 నుంచి పెద్దమ్మ జాతర
నంద్యాల జిల్లా సంజామల మండలం నొస్సం గ్రామంలో ఈనెల 27 నుంచి గ్రామ పెద్దమ్మ జాతర ఉత్సవాలు నిర్వహించనున్నట్లు గురువారం గ్రామ పెద్దలు తెలిపారు. 27న రాత్రి శ్రీ చౌడేశ్వరిదేవి జ్యోతులు, 28న రాత్రి అమ్మవారి ఉత్సవం జరగనుంది. 29న ఉదయం భక్తులు బోనాలు సమర్పించనుండగా, రాత్రి దీవెన బండారు ఇచ్చే కార్యక్రమం ఉంటుందని వివరించారు. ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని గ్రామస్థులు కోరారు.