కనిగిరి పట్టణంలోని గార్లపేట రహదారిలో కొలువైన శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా శ్రీ గోదా రంగనాథ స్వామి, శ్రీకృష్ణ భగవానునికి ధనుర్మాస పూజా కార్యక్రమాలు వేద పండితుల ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. పట్టణానికి చెందిన మహిళా భక్తులు ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి ధనుర్మాస పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ధనుర్మాస పూజల అనంతరం భక్తులకు ఆశీర్వచనాలను అందజేసిన వేద పండితులు స్వామివారి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.