నారాయణపేట్: అదనపు ఎస్పీని అభినందించిన ఎస్పీ యోగేష్ గౌతం
హైదరాబాదులో జరిగిన 22 వ ఓపెన్ లాన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ నేషనల్ లెవెల్ లో 55 ఏజ్ కేటగిరిలో అదనపు ఎస్పి ఎండి రియాజ్ ఫుల్ హక్, మల్టీ జోన్ 1 ఐ జి పి చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ లు లాన్ టెన్నిస్ డబుల్స్ విభాగంలో పోటీపడి ఫైనల్లో జూబ్లీహిల్స్ టీం పై గెలుపొందారు. ఈ సందర్భంగా నారాయణపేట ఎస్పీ యోగేష్ గౌతం అదనపు ఎస్పీని ఐదున్నర గంటల సమయంలో అభినందించారు. పోలీస్ విధుల పట్ల కర్తవ్యం నిబద్ధత తో పాటు క్రీడల్లోను ప్రతిభ కనబరచడం జిల్లా పోలీస్ శాఖకు ఎంతో గర్వకారణమని ఎస్పీ అన్నారు. అదనపు ఎస్పీ సాధించిన విజయం యువ పోలీసులకు ఎంతో స్ఫూర్తి దాయకమని ఎస్పీ అన్నారు.