సర్వేపల్లి: అనుమతులు లేకుండా టపాసులు అమ్మితే జైలుకే : పొదలకూరు SI హనీఫ్
అనుమతులు లేకుండా టపాసులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని పొదలకూరు ఎస్సై హనీఫ్ తెలిపారు. టపాసులు కాల్చే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. దీపావళి పండుగను సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. టపాసులు విక్రయించే దుకాణదారులు దానికి సంబంధించిన జాగ్రత్తలు అన్ని కచ్చితంగా పాటించాలని ముఖ్యంగా ఇసుక, నీళ్లు ,ఫైర్ సేఫ్టీ సిలిండర్లు,ఏర్పాటు చేసుకోవాలని గురువారం సాయంత్రం తెలిపారు